జనగామలో బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ నిమజ్జన వేడుకలను బతుకమ్మ కుంట వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అనితా వాంకుడోతు మాట్లాడుతూ ప్రకృతి ఆరాధన, ఐక్యత బంజారాల ప్రత్యేకత అన్నారు. గిరిజనులు సంప్రదాయ నృత్యాలు, భక్తి పాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో బలునాయక్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ ప్రతీక


