హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంఘ బలోపేతానికి కృషి చేస్తాం: నూతన కార్యవర్గం

JN: రఘునాథపల్లి మండల మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు నల్గొండ మహేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గండ్ర నవీన్, ఉపాధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్, రమేష్, ప్రధాన కార్యదర్శిగా అంగిరేకుల సారయ్య, కోశాధికారిగా పర్వత యుగేందర్ ఎన్నికయ్యారు. సంఘాన్ని బలోపేతం చేసి సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.