హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ధర్మపురి ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శరత్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వారికి దేవస్థాన పూర్ణకుంభం, మేళ తాళాలతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.