హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు

MDK: జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మోస్తరు వానలు పడ్డాయి. అత్యధికంగా శివంపేట మండలంలో 19 మి.మీ, కొత్తపేటలో 16.3, చేగుంటలో 15, మిన్‌పూర్ (పాపన్నపేట)లో 11.8 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 33.8°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.2°Cగా నమోదు కావడంతో ఉక్కపోత తగ్గి వాతావరణం చల్లబడింది.