MHBD: ఇనుగుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.7 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పరిశీలించారు. అదనపు తరగతి గదులు, ప్రహరి తదితర నిర్మాణాలకు రూ. 6 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు, రూ.కోటి ఎంపీ నిధులు కేటాయించారు. పనుల పురోగతిని పరిశీలించిన ఎంపీ.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
'పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి'


