హైదరాబాద్: 28°C
తెలంగాణ

వట్టివాగు ప్రాజెక్టులో రెండు గేట్ల ఎత్తివేత

ఆసిఫాబాద్‌లోని వట్టివాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 239.250 మీటర్లకు చేరగా, ప్రస్తుత నీటి నిల్వ 2.784 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, స్పిల్‌వే ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్లను 0.5 మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.