HNK: దామెర మండలం పులుకుర్తిలో ఓ వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 3 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో ఆదివారం ఆ ఇంటిపై దాడి చేసి గంజాయిని పట్టుకున్న పోలీసులు, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
తెలంగాణ
దామెరలో భారీ గంజాయి స్వాధీనం


