హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ముగ్గురి అదుపులో

NGKL: వెల్దండ మండలం రాచూర్ తండా సమీపంలో గుప్త నిధుల కోసం పూజలు నిర్వహిస్తూ జేసీబీతో తవ్వకాలు చేపడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుత్తి సత్యనారాయణ, కేతావత్ శంకర్, జేసీబీ ఆపరేటర్ శ్రీశైలంను అదుపులోకి తీసుకుని జేసీబీ, హోండా షైన్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.