హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళం వేసిన ఇంట్లో చోరీ.. నగదు, వెండి ఆభరణాల అపహరణ

HNK: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు నగదు, వెండి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన కాజీపేట పట్టణంలో వెలుగు చూసింది. విష్ణుపురికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి బాలిని వెంకటేశ్వర్లు శనివారం ఇంటికి తాళం వేసి హనుమకొండకు వెళ్లగా, అర్ధరాత్రి దొంగలు తాళం పగులగొట్టి చోరీ చేశారు. ఆదివారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.