హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు, సైకిల్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MNCL: దండేపల్లి మండలం తాళ్లపేట మసీదు సమీపంలో రాత్రి సమయంలో కారు, సైకిల్ ఢీకొనడంతో నాగసముద్రం గ్రామానికి చెందిన సిరికొండ కొమురయ్యకు గాయాలయ్యాయి. ద్వారకకు చెందిన కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన కొమురయ్యను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.