హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

ASF: బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,980 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన మరో 8 మంది పరారయ్యారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి, పరారైన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు.