హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మోస్తరు వర్షాలు

SRD: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. ఆమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో అత్యధికంగా 35.5 మి.మీ వర్షపాతం నమోదైంది. సుల్తాన్‌పూర్‌లో 31.0, రామచంద్రాపురంలో 29.0, బీహెచ్‌ఈఎల్‌లో 26.0, పటాన్‌చెరులో 25.3 మి.మీ వర్షం కురిసింది. పశమైలారం, రుద్రారంలో 23.8, కాందిలో 21.0, కలెక్టరేట్ పరిధిలో 19.5 మి.మీ వర్షపాతం నమోదైంది.