హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రదానం..!

PDPL: రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ ఎల్కలపల్లి గేట్‌కు చెందిన లారీ డ్రైవర్ పొన్నం శ్యాంసుందర్ ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన నేత్రాలను దానం చేశారు. ఆదివారం నిర్వహించిన సంస్మరణ సభలో కుటుంబ సభ్యులకు అభినందన పత్రం అందజేశారు. ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానికులు కుటుంబ సభ్యులను అభినందించారు.