హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్‌పై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

KMR: దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిపై ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందన్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.