VSP: విశాఖపట్నం-మర్రిపాలెం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఓ మృతదేహం లభ్యమైందని జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. రైలు ఢీకొనడంతో మృతి చెంది ఉంటాడని, అతని వయస్సు సుమారు 42-45 ఏళ్లు ఉంటాయని చెప్పారు. తెలుపు-నీలం-ఆకుపచ్చ చెక్స్ ఫుల్‌హ్యాండ్ షర్ట్, నలుపు ప్యాంట్, బూడిద రంగు షార్ట్ ధరించి ఉన్నాడని, మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో రైలు పట్టాలపై మృతదేహం


