VSP: గీతం యూనివర్శిటీ 17వ స్నాతకోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. డిగ్రీ ఒక తలుపు మాత్రమేనని, విజయం కోసం నైపుణ్యం, పట్టుదల, క్రమశిక్షణ అవసరమన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సమస్యలకు పరిష్కారాలు చూపే జాబ్ క్రియేటర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు. AI, రోబోటిక్స్‌కు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీతో ఆగొద్దు.. జాబ్ క్రియేటర్లుగా ఎదగాలి: ఎంపీ


