హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రుషికొండ బీచ్‌లో విదేశీ అతిధులకు తేనేటి విందు

VSP: రెండు రోజుల సదస్సుకు వచ్చిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం రుషికొండ బీచ్‌ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. కొంతమంది కళాకారులతో కలిసి థింసా ఆడారు. మరి కొంతమంది ప్రతినిధులు తోట్లకొండ బౌద్ధ క్షేత్రాలను సందర్శించారు.