హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన రేషన్ డీలర్లకు కనీస వేతనం చెల్లించాలి'

ASR: గిరిజన రేషన్ డీలర్లకు రూపాయి కమీషన్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం చెల్లించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరులో గిరిజన రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో రేషన్ పంపిణీకి రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్, నిల్వ ఖర్చులు పెరిగినా డీలర్లకు సరైన ఆదాయం లేదని ఆరోపించారు.