హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బార్‌లో ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు

కృష్ణా: మచిలీపట్నం చిలకపూడి రైల్వే గేట్ సమీపంలోని ఓ బార్‌లో ఇద్దరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. కనుముడి నాగరాజుపై వేముల మహేష్ దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన నాగరాజును మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.