హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైసమ్మ ఆలయంలో మల్లారెడ్డి ప్రత్యేక పూజలు

MDCL: బోనాల పండుగ సందర్భంగా మేడ్చల్ పట్టణ కేంద్రంలోని గడి మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.