VKB: తాండూరు మల్‌రెడ్డిపల్లిలోని రాజయోగ కేంద్రంలో బ్రహ్మకుమారీ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మకుమారీ సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అని, సమాజంలో సోదరభావం, మానవతా విలువలు మరింత పెంపొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తెలంగాణ
రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్యే బీఎంఆర్


