హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోడ కూలి విద్యార్థి మృతి

ATP: శెట్టూరు విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి 8వ తరగతి విద్యార్థి మృతి చెందారు. స్థానిక ఎస్సీ హాస్టల్‌లో చదివే విద్యార్థి హర్షవర్ధన్ తన మిత్రుడు అక్షయ్‌తో కలిసి పక్కనున్న కాలేజీ గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా గోడ కూలి మీద పడడంతో హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందారు. అక్షయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.