హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐపీఎల్ ఆడకుండానే టీమిండియాలోకి ఆల్‌రౌండర్ 

మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ 33 ఏళ్ల వయసులో టీమిండియా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో కొలంబో టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘకాలంగా రాణించిన సారాంశ్‌కు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. దీంతో ఐపీఎల్‌కు ముందే భారత జట్టులోకి వచ్చిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.