హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కలెక్టరేట్‌లో ప్రజా వాణి కార్యక్రమం

HNK: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయుల్లో అధికారులు ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.