హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షాల కోసం పాండవుల గుహల్లో రైతుల భజనలు

AKP: మునగపాక మండలం తోటాడ పంచాయతీ పరిధిలో వర్షాలు కురవాలని కోరుతూ రైతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా స్థానిక పాండవుల గుహల వద్దకు చేరుకుని మేళతాళాలు వాయిస్తూ, 'గోవిందా' నామస్మరణతో భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు కోరుబిల్లి విష్ణు మహేశ్వరరావు, వెంకట్, పోలమరశెట్టి నాగభూషణ్, నాగేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు.