హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కల్వకుర్తిలో దంచి కొట్టిన వర్షం..

NGKL: కల్వకుర్తి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకుని తొలుత ముసురుగా మొదలైన వర్షం క్రమంగా భారీగా మారింది. మార్చాల, కురుమిద్ద, వెంకటాపూర్, జీడిపల్లి తదితర గ్రామాల్లో కూడా వర్షం కురిసింది. వర్షంతో పత్తి తదితర పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.