VZM: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన నెల్లిమర్ల చిన్నమల్లుపేట ఎంపీపీ పాఠశాల ఎస్‌జీటీ కౌలూరి రాజేష్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. రాజేష్ జాతీయ స్థాయిలో అవార్డు సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు సాగటం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపాధ్యాయుడికి మంత్రి సత్కారం


