కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం'


