హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు తరాలకు సేవలందించిన అటెండర్ మృతి

SRCL: బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన టీఆర్ఎస్ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు అలువాల రాజయ్య తండ్రి హనుమయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. అనంతపల్లి ప్రాథమిక పాఠశాలలో అటెండర్‌గా మూడు తరాలకు సేవలందించారని, ఆయన మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంతాపం తెలిపారు. పాఠశాల పట్ల అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.