JN: దేవరుప్పుల మండలం చిన్నమడూరులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో దేవరుప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని వారు పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం'


