KMR: రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన పిట్లం వాసి రాజు సెట్‌ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం పరామర్శించారు. శనివారం ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు వెళ్లిన రాజు సెట్ తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే పిట్లం చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే


