హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాగజ్ నగర్‌లో సైబర్ మోసానికి గురైన ఆర్మీ జవాన్

ASF: కాగజ్ నగర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి షేక్ అనీస్ 4 క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2,16,018.77 మాయం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సైబర్ క్రైమ్ విభాగంలో ఆదివారం ఫిర్యాదు నమోదైంది. బ్యాంకులు, కార్డు సంస్థల సమన్వయంతో నగదు రికవరీకి చర్యలు చేపట్టారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.