హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురస్కారం అందుకున్న విశ్వతేజ

SDPT: శ్రీవాణి సాహిత్య పరిషత్ సిద్దిపేట 12వ వార్షికోత్సవ సమావేశం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ హైస్కూల్ విద్యార్థి విశ్వతేజ రచించిన 'విశ్వతేజం' పుస్తకానికి పెందోట బాల సాహిత్య పురస్కారం అందజేశారు. పురస్కార ప్రదాత పెందోట వెంకటేశ్వర్లు, బాల సాహితీవేత్తలు దుర్గయ్య, శ్యామల పాల్గొన్నారు.