హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

SS: ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ రెడ్డప్ప కౌన్సెలింగ్ నిర్వహించారు. పండుగలు, పర్వదినాల సమయంలో నేర కార్యకలాపాలకు, వివాదాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు.