హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంధ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

MHBD: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన డిప్యూటీ తహసీల్దార్ డోలి సంధ్య కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సంధ్య ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండీ ఫరీద్, మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.