SRD: సంగారెడ్డి మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నిహారిక ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.
తెలంగాణ
రేపు ఎంపీడీవో ఆఫీస్‌లో ప్రజావాణి


