హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిజాం వ్యతిరేక పోరాటానికి శాస్త్రి చేసిన సేవలు మరువలేనివి'

ADB: కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధులు కామ్రేడ్ రామ్ కిషన్ శాస్త్రి 41వ వర్ధంతిని ఆదిలాబాద్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న CPI జిల్లా నాయకులు శాస్త్రి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటానికి రామ్ కిషన్ శాస్త్రి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.