WGL: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు చెరువు సమీపంలో తాత్కాలిక డివైడర్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. గుజరాత్ నుంచి గుంటూరుకు యూరియా బస్తాలతో వెళ్తున్న లారీ ఆదివారం డివైడర్‌పైకి ఎక్కడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు వెడల్పు చేయకుండానే డివైడర్ ఏర్పాటు చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.
తెలంగాణ
ప్రాణ సంకటంగా మారిన తాత్కాలిక డివైడర్


