ప్రకాశం: కంభంలో ఎస్సై శివకృష్ణ ఆధ్వర్యంలో ఓపెన్ బూజింగ్ ప్రదేశాలను గుర్తించి, అక్కడ పేరుకు పోయిన ఖాళీ మద్యం సీసాలు, వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ప్రజలకు ప్రశాంతమైన, సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఈ చర్యలు నిరంతరం కొనసాగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
బహిరంగ మద్యం సేవించే ప్రదేశాలపై నిఘా


