హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి జలాలతోనే కరువు నివారణ: సీపీఎం

SDPT: సిద్దిపేట రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నివారణకు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. కరువు ప్రాంతాలను గుర్తించి తక్షణమే ఆదుకోవాలని కోరారు.నీటి ఎద్దడిని నివారించేందుకు గోదావరి నది నుంచి ప్రతిరోజూ రెండు టీఎంసీల జలాలను ఎత్తిపోసి పంట పొలాలకు అందించాలని కోరారు.