ASR: హుకుంపేట మండలం పెద్దగరువు టోల్‌గేట్ వద్ద ఆదివారం సీఐ ఎస్.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం, మైనర్లతో వాహనాలు నడిపించడం తదితర ఉల్లంఘనలకు సంబంధించి మోటారు వాహన చట్టం కింద 18 కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినట్లు సీఐ తెలిపారు. రహదారి భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వాహన తనిఖీల్లో 18 కేసులు నమోదు: సీఐ


