కోనసీమ: కొత్తపేటలో ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదు కార్యక్రమం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని కొత్తపేట RDO జీవివి సత్యనారాయణ పరిశీలించారు. కొత్తపేట గ్రామ పంచాయతీ పోలింగ్ బూత్, జడ్పీ బాలికోన్నత పాఠశాల వద్ద ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్స రాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో


