హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్ణశాల ప్రత్యేకతలు..?

BDK: పర్ణశాలకు రామాయణంతో విడదీయరాని అనుబంధం ఉంది. వనవాస సమయంలో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ఇక్కడే నివసించారని భక్తుల విశ్వాసం. సీతమ్మ వాగు, రామాలయం, రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టే శిల్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రకృతి అందాల కలయికగా పర్ణశాల ప్రత్యేక గుర్తింపు పొందింది. రామాయణ ఘట్టాల శిల్పాలను చూస్తూ, రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వనవాసంలో గడిపిన రోజులను ఊహించుకోవచ్చు.