హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికి మన్యం పోలీస్‌తో అవగాహన.

PPM: ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, మహిళలపై అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పాలకొండ డీఎస్పీ రాంబాబు సూచించారు. జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నమోదవుతున్న కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఎస్సైని ఆదేశించారు.