హైదరాబాద్: 28°C
వార్తలు

నెక్లెస్ రోడ్‌లో 'పవర్ ఎగ్జిబిషన్-2026'

HYD: నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో TGSPDCL నిర్వహించిన 'పవర్ ఎగ్జిబిషన్-2026'ను ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు సందర్శించారు. విద్యుత్ రంగా పురోగతి, స్మార్ట్ టెక్నాలజీలు, 120 ఏళ్ల చరిత్రను పరిచయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించే ఈ ప్రదర్శనను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని, విద్యుత్ అధికారులను అభినందించారు.