హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా: ఎంపీ

KRNL: కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు రూ.10,99,948 విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు ఇవాళ పంపిణీ చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులు సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరాముడు పాల్గొన్నారు.