హైదరాబాద్: 28°C
క్రైమ్

అత్తింటి వారి వేధింపులు.. అధికారిణి ఆత్మహత్య

కేంద్ర రక్షణశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాజియా ఖానమ్ ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేకే తన కుమార్తె మృతిచెందిదని మృతురాలి తండ్రి తవాబ్ ఖాన్ ఆరోపించారు. ఏప్రిల్ 11న ఆజమ్ అలీ ఖాన్‌తో తమ కుమార్తెకు వివాహం జరిగినట్లు తెలిపారు. ఆమె భర్తే తమ కుమార్తెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.