E.G: గోకవరం నుంచి రంప ఎర్రంపాలెం వెళ్లే సిమెంట్ రోడ్డు కాలువను తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. 9 నెలల క్రితం కోట్లు వెచ్చించి రోడ్డు వేశారు. చర్చి వద్ద చెరువులోకి నీరు వెళ్లేలా పెద్ద తూములు ఏర్పాటు చేయకపోవడంతో వర్షం, మురుగు నీరు రోడ్డుపై పొంగిపొర్లుతోందని వాపోతున్నారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలువను తలపిస్తున్న సిమెంట్ రోడ్డు


