హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అచ్చంపేట MLA డా. చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించారు. పేద, అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.