హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ విగ్రహ ప్రతిష్టకు హాజరైన MP

GDWL: గద్వాల పట్టణంలోని శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఆలయ పెద్దలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ మన సంస్కృతి, ధర్మాన్ని పాటిస్తూ పూజలు నిర్వహించడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.